కొత్త ఒరవడికి సిద్ధమంటున్న తారక్
- IndiaGlitz, [Saturday,October 06 2018]
రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఆయనే ఇస్తే బావుంటుందని అంటున్నారు ఎన్టీఆర్. చరణ్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. 'ఆర్ ఆర్ ఆర్' కు సంబంధించిన విశేషాలను చెప్పకూడదని లేదు అని, అయితే వాటి గురించి తనకు పూర్తిగా తెలియదనీ అన్నారు. ఈ ఏడాది చివరి నుంచి షూటింగ్ ఉండొచ్చని తెలిపారు. మంచి కథలతో, స్టార్లను డీల్ చేయగల కెప్టెన్లు ఉంటే కొత్త ఒరవడి సృష్టించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని అన్నారు తారక్.
యంగ్ హీరోలందరూ ఆ దశగానే ఆలోచిస్తున్నారని అన్నారు. అరవింద సమేత తనలో మంచి మార్పు తెచ్చిందని, మానసిక ప్రశాంతత ఉంటే ఇంకేదీ అక్కర్లేదనీ. సినిమా హిట్లు, ఫ్లాప్‌లు మనసుకు ఎక్కించుకోననీ , హిట్ అయినా, ఫ్లాప్ అయినా నాలుగు రోజులే ఆ ధ్యాస ఉంటుందని చెప్పారు. కాకపోతే అభిమానులే మార్కెట్లో బయట ఉంటారు కాబట్టి, వారి మీదే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.