RRR కంటే ముందుగానే.. బుల్లితెరపై అల్లూరి, కొమరం భీం?

ఆర్ఆర్ఆర్ టీం విడుదల చేసిన మేకింగ్ వీడియో రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఎన్టీఆర్, రాంచరణ్ లతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రాజమౌళి సరైన వేదికని సెట్ చేసేశారని మేకింగ్ వీడియోతో క్లారిటీ వచ్చేసింది.

స్వాతంత్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి పాత్రల్లో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుంచి ఎన్టీఆర్, చరణ్ మధ్య బాండింగ్ బాగా పెరిగింది. వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇద్దరినీ కలిపి వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆ కోరిక నెరవేరబోతోంది.

అంతకంటే ముందుగానే ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం బుల్లితెరపై 'మీలో ఎవరు కోటీశ్వరులు' అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ షూటింగ్ జరుగుతోంది. ఈ షోకి తొలి గెస్ట్ గా రాంచరణ్ హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

త్వరలోనే దానిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. స్టార్ సెలెబ్రటీలు చేసే బుల్లితెర షోలకు ప్రస్తుతం బాగా క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ గతంలో కూడా బిగ్ బాస్ తొలి సీజన్ కు హాట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికి వస్తే షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. కేవలం ఓ సాంగ్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 3 కోట్ల బడ్జెట్ లో ఈ సాంగ్ ని రాజమౌళి..చరణ్, ఎన్టీఆర్, అలియాపై చిత్రీకరించనున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.