'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, చరణ్ కొట్టుకుంటే?
- IndiaGlitz, [Tuesday,June 01 2021]
'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కొట్టుకుంటారా? ఇద్దరి మధ్య భారీ ఫైట్ ఉందా? అంటే... దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, రచయిత వి. విజయేంద్రప్రసాద్ చెప్పిన మాటలు వింటే 'అవును' అని ఎవరైనా అంటారు. హీరోలు ఇద్దరూ కొట్టుకుంటే ప్రేక్షకులు కంటతడి పెడతారని ఆయన చెప్పారు.
'ఆర్ఆర్ఆర్'లో ఒక ఫైట్ సీన్ ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తుందని వి. విజయేంద్రప్రసాద్ వివరించారు. 'ఆలీతో జాలీగా' ప్రోగ్రాం లో ఫైట్ సీన్ గురించి అడిగారు.
ఇదీ చదవండి: రెండు సార్లు ఛాన్స్ మిస్.. టాలీవుడ్ స్టార్ హీరోపై ప్రియమణి
జనరల్ గా మనం ఫైట్ చూస్తుంటే... విలన్ ను కొట్టు, నరుకు అంటుంటాం. ఇద్దరు మంచి వాళ్ళు కొట్టుకుంటుంటే ఎవరి పక్షాన ఉంటాం? ఇద్దరు కుమారులు కొట్టుకుంటుంటే... తల్లి ఎవరి పక్షాన ఉంటుంది? 'కొట్టుకోవద్దు' అని ఏడుస్తుంటుంది. అదేవిధంగా ఇద్దరు సూపర్ స్టార్లు కొట్టుకుంటుంటే ప్రేక్షకులకు కన్నీళ్లు వస్తాయి. ఇద్దరు మంచి వాళ్ళు. పరిస్థితుల ప్రభావం వల్ల కొట్టుకుంటారు. పప్పులు మనకు ఏడుపు వస్తుంది అని విజయేంద్రప్రసాద్ చెప్పారు.
చూసేది సినిమా అని, ఇద్దరూ మళ్ళీ కలుస్తారని తెలిసినా... కంటతడి పెట్టుకున్నానని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తుందని అన్నారు. ఎన్నిసార్లు చూసినా ఆ క్షణానికి అదే అనుభూతి వస్తుందని ఆయన అన్నారు.