అభిమానులకు ఎన్టీఆర్ రాఖీ కానుక
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `జై లవకుశ`. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో నెగటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రతో పాటు లవ, కుశ పాత్రల్లో కూడా ఎన్టీఆర్ కనపడనున్నాడు. అందులో భాగంగా పూణేలో జై పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. పూణేలో ఈ చిత్రీకరణ జరుగుతుంది. ఇంతకు పూణేలో ఎందుకు చిత్రీకరిస్తున్నారంటే పూణేలోనే ఎన్టీఆర్ బిగ్ బాస్ షో జరుగుతుంది.
కాగా జై టీజర్ విడుదలైన 48 గంటల్లోనే సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ పోషించిన మరో పాత్ర లవకుమార్‌కు సంబంధించిన టీజర్‌ను అక్టోబర్ 7, రాఖీ పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారు. అల్రెడి జై టీజర్ క్రియేట్ చేసిన వైరల్ తో లవకుమార్ టీజర్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. `జై లవకుశ` సెప్టెంబర్ 21న విడుదల కానుంది. నివేదా థామస్, రాశిఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ సినిమాను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com