సాహో ఎన్.బి.కెః ఎన్టీఆర్

  • IndiaGlitz, [Monday,January 16 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో, బాల‌కృష్ణ నటించిన 100వ చిత్రం 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి'. బిబో శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఫ‌స్ట్‌ఫ్రేమ్ ఎంట‌ర్‌టై్న్మెంట్స్ బ్యాన‌ర్‌పై వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు నిర్మించిన ఈ చిత్రం విడుద‌లైన రోజు నుండి అన్నీ వ‌ర్గాల నుండి పాజిటివ్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తుంది.

ఓవ‌ర్‌సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్‌ను సాధించిన ఈ చిత్రం అంద‌రి విమ‌ర్శ‌ల‌ను పొందుతుంది. రీసెంట్‌గా బాబాయ్ నటించిన ఈ చిత్రాన్ని చూసిన అబ్బాయి ఎన్టీఆర్ చూసి థ్రిల్ ఫీలైయ్యాడు. ఇది తెలుగు వాడి విజ‌యం. తెలుగుజాతి గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రం. చ‌రిత్ర మ‌ర‌చిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తికి నీరాజనం. సాహో ఎన్‌.బి.కె, సాహో క్రిష్ అండ్ సాహో హోల్ టీం అంటూ బాబాయ్ స‌హా అంద‌రినీ సాహో అంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు.