బాహుబలిని ఆకాశానికెత్తేసిన ఎన్టీఆర్...
Send us your feedback to audioarticles@vaarta.com
విజువల్ వండర్‌గా రూపొందిన `బాహుబలి 2` సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సెన్సేషనల్ హిట్ టాక్‌తో కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేస్తుంది. సినిమాను చూసిన సినీ ప్రముఖుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందుగా సినిమాపై తన స్పందననను తెలియజేశాడు. దర్శకధీరుడు రాజమౌళిని తన ట్వీట్లతో ఆకాశానికెత్తేశాడు.
బాహుబలి 2 సినిమా ఇండియన్ సినిమాలోనే ఫైనెస్ట్ కాన్వాస్ అని చెప్పిన ఎన్టీఆర్ తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమాను కూడా నెక్స్‌ట్ లెవల్‌కు తీసుకెళ్ళాడు. రాజమౌళి విజన్‌ను ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ సహా ఇతర నటీనటులు తమ గొప్ప నటనతో నిజం చేసేలా సహకారం అందించారు. ఎం.ఎం.కీరవాణి ప్రతి ఫ్రేమ్‌కు తన మ్యూజిక్‌తో ప్రాణం పోశాడు. రాజమౌళి కలను నిజం చేసేందుకు అడిగినంత బడ్జెట్ ఇచ్చి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు సపోర్ట్ చేశారంటూ అభినదించాడు. రాజమౌళి అంటే ఎన్టీఆర్‌కు చాలా అభిమానం అనే సంగతి తెలిసిందే ఎన్టీఆర్ కెరీర్‌లో బెస్ట్ హిట్స్ అయిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ చిత్రాలను రాజమౌళియే డైరెక్ట్ చేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com