అబ్బాయి పదమే బాబాయ్ టైటిల్ కానుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లోని స్టార్ ఫ్యామిలీల్లో నందమూరివారు ఒకరు. వీరిలో బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి తారక్ స్టార్ హీరోలుగా అగ్రపథంలో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు అబ్బాయి తారక్ సినిమాలో పాపులర్ అయిన ఓ డైలాగ్‌లోని పదాన్ని బాబాయ్ బాలయ్య లేటెస్ట్ మూవీ టైటిల్‌గా పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకెళ్తే తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘అరవింద సమేత’. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఉపయోగించిన టార్చ్ బేరర్ అనే పదం చాలా ఫేమస్ అయ్యింది. ఈ టార్చ్ బేరర్ అనే పదాన్నే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రానికి పెట్టాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈసినిమాకు టైటిల్ ఇదంటూ పలు టైటిల్స్ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘మొనార్క్, మొనగాడు’, ‘డేంజర్’, ‘బొనాంజ’ వంటి టైటిల్స్ వినిపించాయి. తాజాగా ఈ లిస్టులో ‘టార్చ్ బేరర్’ కూడా చేరింది. కరోనా వైరస్ ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్... పరిస్థితులు చక్కబడ్డ తర్వాత మొదలవుతుందని సమాచారం. సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో బాలకృష్ణ అఘోరా గెటప్లోనూ కనిపిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com