డాన్సర్ పాత్రలో ఎన్టీఆర్
- IndiaGlitz, [Monday,May 15 2017]
జనతా గ్యారేజ్ వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం 'జై లవకుశ'. ఈ చిత్రంతలో రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తుంటే నందితరాజ్ స్పెషల్ ఆప్పియరెన్స్‌లో కనపడుతుంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.
అందులో ఒక క్యారెక్టర్ క్లాసికల్ డ్యానర్స్ రోల్. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుని ఎన్నో స్టేజ్ షోస్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఎక్కడా క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో కనపడలేదు. అయితే జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ క్లాసికల్ డ్యానర్స్‌గా కనపడనున్నాడట. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ పెద్దగా కష్టపడనక్కర్లేదు.