బిగ్ బజ్ : బాలీవుడ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ?
Send us your feedback to audioarticles@vaarta.com
క్రమంగా తెలుగు సినిమాకు హద్దులు చెరిగిపోతున్నాయి. బాహుబలితో టాలీవుడ్ లో ఈ ఆనవాయితీ మొదలయింది. బాహుబలి క్రేజ్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. మిగిలిన స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ తమ మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారు.
Also Read: బిగ్ చీటింగ్.. బట్టబయలు చేసిన సోనూసూద్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇకపై పాన్ ఇండియా చిత్రాలపై ఫోకస్ పెట్టనున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ తదుపరి చిత్రాల జాబితాలోకి బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చేరినట్లు తెలుస్తోంది.
కళాత్మకంగా చిత్రాలు చేసే సంజయ్ ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. బాజీరావు మస్తానీ, పద్మావత్ లాంటి చిత్రాలు బన్సాలీ ప్రతిభకు నిదర్శనం. బన్సాలీ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా చిత్రానికి చర్చలు జరుగుతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే మరో కళాఖండానికి తెరలేచినట్లే.
చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథల్లో బన్సాలీకి మంచి పట్టు ఉంది. ఆ తరహా పాత్రలు వస్తే తన విశ్వరూపం ప్రదర్శించాలని ఎన్టీఆర్ ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్నాడు. అందులోనూ ఎన్టీఆర్ మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులని మరింత ఆసక్తికి గురిచేస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీంగా నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com