ఫ్యాన్సీ రేటుకు 'య‌న్‌.టి.ఆర్' ఓవ‌ర్‌సీస్ హ‌క్కులు

  • IndiaGlitz, [Sunday,November 04 2018]

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి 'ఎన్టీఆర్' బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. అందులో మొద‌టిది 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది. రెండో భాగం 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' జ‌న‌వ‌రి 24న విడుద‌ల‌వుతుంద‌ని చిత్ర యూనిట్ ఇది వ‌రకే ప్ర‌క‌టించింది. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్ర‌మిది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌కుడు.

లేటెస్ట్‌గా ఈ సినిమా రెండో భాగం 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' విడుద‌ల‌ను కాస్త వెన‌క్కి తీసుకెళ్లాల‌ని యూనిట్ ఆలోచిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే సినిమా బిజినెస్ క్రేజీగా సాగిపోతుంది. స‌మాచారం ప్ర‌కారం ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ను నంద‌మూరి అభిమాని ఒక‌రు 18 కోట్ల రూపాయ‌ల‌కు కోనుగోలు చేశారు. రెండు భాగాల‌కు సంబంధించిన ఓవ‌ర్‌సీస్ హ‌క్కులివి. రెండు కోట్ల రూపాయ‌లు రిక‌వ‌బుల్ అమౌంట్‌.