ప్రత్యేకమైన సన్నివేశంతో 'యన్.టి.ఆర్' ఒక్క రోజు షెడ్యూల్
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటుడు నందమూరి తారక రామారావు జీవితకథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. 'యన్.టి.ఆర్'. టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ నిర్మాత కాగా.. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ నెల 29న పూజా కార్యక్రమాలు జరిపి.. ఆ తర్వాత లాంఛనంగా షూటింగ్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి అతి ముఖ్యమైన సన్నివేశాన్ని ఆ ఒక్క రోజు షెడ్యూల్లో తెరకెక్కించనున్నారని సమాచారం. 1940లలో సర్వీస్ కమిషన్ ఉద్యోగంలో జాయిన్ అవడానికి ఎన్టీఆర్ మద్రాసు నగరానికి రావడం.. ఆ తర్వాత నటుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వైనాన్ని తెలిపే సన్నివేశాన్ని ఆ రోజు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ తర్వాత షూటింగ్‌కు కొంత విరామం ఇచ్చి.. వేసవి తర్వాత అంటే ఆగష్టు నుంచి నిరవధికంగా చిత్రీకరణను జరిపే ప్లాన్‌లో ఉన్నారు దర్శకుడు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout