ఎన్టీఆర్.. పాత్రలకే కాకుండా..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్లోనే తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జైలవకుశ. ఈ సినిమాలో జై, లవకుమార్, కుశ అనే మూడు పాత్రలు పోషించాడు తారక్. ఈ మూడు పాత్రలకు బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ వరకు.. ఇలా ప్రతి అంశంలోనూ వేరియేషన్స్ ఉండేలా ఎన్టీఆర్ తీసుకున్న జాగ్రత్తలు టీజర్, ట్రైలర్స్‌లో స్పష్టంగా తెలుస్తున్నాయి.
ఇక డ్యాన్స్‌లకు పెట్టింది పేరు అయిన తారక్.. ఆ విషయంలోనూ మూడు క్యారెక్టర్లకి వేరియేషన్ చూపించాడట. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆరే చెప్పుకొచ్చాడు తాజా ఇంటర్వ్యూలో. ఈ మూడు పాత్రల కోసం చేసిన నృత్యాల తీరు.. చూసే ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తాయని ఆయన నమ్మకంగా చెప్పుకొచ్చాడు.
రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన జైలవకుశకి పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహించారు. కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments