ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఎప్పుడంటే...

  • IndiaGlitz, [Thursday,June 15 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ప్ర‌స్తుతం జై ల‌వ‌కుశ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. జై ల‌వ‌కుశ త‌ర్వాత ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా రూపొంద‌నుంద‌ని స‌మాచారం. అయితే త్రివిక్ర‌మ్ కూడా ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా కూడా సెప్టెంబ‌ర్‌లో పూర్తవుతుంద‌ని, దాదాపు ఈ సినిమాను కూడా ద‌స‌రా సంద‌ర్భంగానే విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా త‌ర్వాతే ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్‌ల సినిమా న‌వంబ‌ర్‌లో ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌. ఈ సినిమాను దాదాపు హారిక హాసిని క్రియేష‌న్స్ నిర్మిస్తుంది.