ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ వచ్చేసింది..!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఆగష్టు 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...పూరి జగన్నాథ్ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరికీ ఒకే రోజు కథలు చెప్పి ఒప్పించారు. కళ్యాణ్ రామ్ తో పూరి సినిమా ప్రారంభించాడు. ఈ సినిమా తర్వాత పూరి ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్టు ప్రచారం జరిగింది. అలాగే ఎన్టీఆర్ రైటర్ వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత పూరి తో సినిమా చేస్తాడా..? లేక వక్కంతం వంశీతో సినిమా చేస్తాడా అనే సందేహం ఉండేది. ఈరోజు ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ పై క్లారిటీ వచ్చేసింది.
అది ఎలా ఉంటే...కళ్యాణ్ రామ్ సోదరుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో...హ్యాపీ బర్త్ డే నాన్నా అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. అందులో ఎన్టీఆర్ ఫోటోతో పాటు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ లో 9వ చిత్రం..ఎన్టీఆర్ కి 27వ చిత్రం ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాత. వక్కంతం వంశీ డైరెక్టర్ అని ఉంది. నాన్నకు ప్రేమతో..ఎన్టీఆర్ 25వ చిత్రం, జనతా గ్యారేజ్ 26వ చిత్రం. సో...జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా వక్కంతం వంశీ తోనే అని క్లారిటీ వచ్చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com