ఎన్టీఆర్ న్యూమూవీ లాంఛ్ డేట్ ఫిక్స్..!

  • IndiaGlitz, [Saturday,December 31 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్ బాబీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్, బాబీ కాంబినేష‌న్లో రూపొందే భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నారు. అయితే...ఈ చిత్రాన్ని రిప‌బ్లిక్ డే రోజు అన‌గా జ‌న‌వ‌రి 26న ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం.
ఈ చిత్రానికి న‌ట విశ్వ‌రూపం అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్లు ప్రచారం జ‌రిగింది. అయితే...ఈ ప్ర‌చారంలో నిజం లేదు. టైటిల్ ఏమిటి అనేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఫైన‌ల్ అయిన వెంట‌నే తెలియ‌చేస్తాం అని నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియచేసింది. ఈ చిత్రంలో న‌టించే హీరోయిన్, మిగిలిన న‌టీన‌టుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 28వ సినిమాని త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ లో సెట్స పైకి వెళ్ల‌నుంది.