ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయ్యిందా..?

  • IndiaGlitz, [Wednesday,March 16 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రం ప్ర‌స్తుతం ముంబాయిలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ లో ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయ్యింది అంటూ ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వార్త ఎక్క‌డి నుంచో రాలేదు. జ‌న‌తా గ్యారేజ్ ట్విట్ట‌ర్ పేజీలో పోస్ట్ అయ్యింది.

అంతే...ఒక్కసారిగా అటు అభిమానుల్లో, ఇటు ఇండ‌స్ట్రీలో ఎన్టీఆర్ కి ఏమైంద‌ని ఆందోళ‌న మొద‌లైంది. అస‌లు ఏం జ‌రిగింద‌ని క‌నుక్కుంటే...ఏం జ‌ర‌గ‌లేద‌ట‌. ఈ విష‌యాన్నినిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ట్విట్ట‌ర్ లో మైత్రీ అఫిషియ‌ల్ ఇదే మా అఫిషియ‌ల్ ఐడి. రూమ‌ర్స్ న‌మ్మ‌వ‌ద్దు..తారక్ బాగానే ఉన్నారు అని తెలియ‌చేసారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్, నిత్యామీన‌న్ ల‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో జ‌న‌తా గ్యారేజ్ టీమ్ ముంబాయి నుంచి హైద‌రాబాద్ రానున్నారు.

More News

యార్ల‌గ‌డ్డ సుమంత్ సినిమా పూర్త‌య్యింది..

ప్రేమ‌క‌థ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే మంచి న‌టుడు అనిపించుకున్నాడు  అక్కినేని మ‌న‌వ‌డు..నాగార్జున మేన‌ల్లుడు యార్ల‌గ‌డ్డ సుమంత్. ఆత‌ర్వాత స‌త్యం, గౌరి, మ‌ధుమాసం, పౌరుడు, గోల్కండ హైస్కూల్...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి స‌క్సెస్ సాధించాడు.

క్ష‌ణం బాలీవుడ్ రీమేక్ లో స‌ల్మాన్..

అడ‌వి శేషు హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన చిత్రం క్ష‌ణం. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ పి.వి.పి నిర్మించిన క్ష‌ణం సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

సూపర్ స్టార్ సూర్య 'మేము' విడుదల వాయిదా!

సూపర్ స్టార్ సూర్య నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన 'పసంగ-2' తెలుగులో 'మేము'

బ్ర‌హ్మోత్స‌వం లేటెస్ట్ న్యూస్...

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న బ్ర‌హ్మోత్స‌వం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు.

స‌ర్ధార్ సెట్ లో క‌మెడియ‌న్ పై ప‌వ‌న్ ఆగ్ర‌హం

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ సెట్ లో ఓ క‌మెడియ‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్త‌చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ టాక్. బుల్లితెర నుంచి వెండితెర‌కు వ‌చ్చిన ఈ క‌మెడియ‌న్ గ‌త కొన్ని రోజులుగా స‌ర్ధార్ షూటింగ్ స్పాట్ కి లేటుగా వ‌స్తున్నాడ‌ట‌...ఎన్ని సార్లు చెప్పినా అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేద‌ట‌.