ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

  • IndiaGlitz, [Wednesday,October 14 2015]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం నాన్న‌కు ప్రేమ‌తో..సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తో ఓ సినిమా చేస్తున్నారు.

ఈ మూవీని శ్రీమంతుడు సినిమాని నిర్మించిన మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్..రైట‌ర్ వక్కంతం వంశీతో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.క‌ళ్యాణ్ రామ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఇద్ద‌రు క‌ల‌సి న‌టించ‌నున్నార‌ట‌. ఇదే క‌నుక నిజమైతే...ఈ నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్ మూవీని వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తుండ‌డం ఓ విశేషమైతే... ఎన్టీఆర్ అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ తో క‌ల‌సి న‌టించ‌డం...ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ లో న‌టించ‌డం మ‌రో విశేషం.