ప్రారంభమైన యంగ్ టైగర్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ ఈరోజు(6) ండన్‌లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 20 వరకు ఈ భారీ షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత మరో కంట్రీలో 20 రోజు పాటు ఓ షెడ్యూల్ చేస్తారు. ఆ తర్వాత 20 రోజు పాటు హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ వుంటుంది. దీనితో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 25వ చిత్రమిది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తారని దర్శకు సుకుమార్ చెప్పారు.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌తోపాటు మరికొంత మంది భారీ తారాగణం నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: విజయ్ కె.చక్రవర్తి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, సమర్పణ: రియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, కో`ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: సుకుమార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments