నవలాధారంగా ఎన్టీఆర్ సినిమా?
Send us your feedback to audioarticles@vaarta.com
త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగు చిత్ర సీమలో సంచలనం సృష్టించిన మాటల రచయిత. ఆపైన దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకున్నారు ఈ మాటల మాంత్రికుడు. దర్శకుడిగా ఎంత విజయం సాధించినా.. కథలని కాపీ చేసి సినిమాలు చేస్తారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. తాజాగా విడుదలైన అజ్ఞాతవాసి` మూవీని ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్`కి స్పూర్తిగా తెరకెక్కించి కాపీ రైట్ వివాదంలో చిక్కుకున్నారు. అలాగే గతంలో కూడా యద్దనపూడి సులోచనారాణి రచించిన నవలాధారంగా స్ఫూర్తి పొంది అఆ` సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఈ విషయానికి సంబంధించి అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు త్రివిక్రమ్. కాగా, ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా యద్దనపూడి నవలని సినిమాగా తెరకెక్కిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే గతంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా ఈసారి ఆమెతో అధికారికంగా ఒప్పదం కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి కల్లా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని.. మార్చి నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు త్రివిక్రమ్. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టరుగా ఖరారు అయిన ఈ చిత్రానికి సంబంధించి.. కథానాయికలతో పాటు మిగిలిన సాంకేతిక బృందాన్ని త్వరలోనే వెల్లడిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com