డైరెక్టర్‌ను ఎత్తుకెళ్లిన ఎన్టీఆర్ మేనేజర్.. అసలేమైంది!?
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే ఇదేంటి టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మేనేజర్ డైరెక్టర్‌ను ఎత్తుకెళ్లాడా..? అసలు అంత బలవంతంగా ఎందుకు ఎత్తుకెళ్లినట్లు..? ఏ సినిమా కోసం ఎత్తుకెళ్లాడు..? అసలేం జరిగింది..? అనే ఆసక్తికర విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ‘సైరా’ సినిమా తెరకెక్కించి సంచలనం సృష్టించిన సురేందర్ రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టాడు. జూనియర్‌తో.. సురేందర్ ఒకట్రెండు సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వీటిలో మొదటి సినిమా ‘అశోక్’ కాగా.. రెండో చిత్రం ‘ఊసరవెళ్లి’. మొదటి చిత్రం తెరకెక్కించినప్పుడు జరిగిన ఓ సెన్సేషనల్ విషయాన్ని ఇటీవల ఆయన బయటపెట్టాడు.
ఇదీ అసలు కథ..!
వాస్తవానికి ఎన్టీఆర్‌తో సినిమా తీయాలని తాను అనుకోలేదని.. తన ప్రమేయం లేకుండా.. తనకు ఇష్టం లేకుండానే ‘అశోక్’ చిత్రాన్ని తెరకెక్కించాల్సి వచ్చిందని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. అతి బలవంతం మీద సినిమా చేయాల్సి వచ్చిందట. తాను యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా తీయాలని అనుకుంటున్న టైమ్‌లో.. ఎన్టీఆర్ మేనేజర్ వచ్చి జూనియర్‌తో సినిమా చేయాలని తనను వెంబడించారన్నారు. అలా రోజు తన వెంట తిరుగుతుంటే ఇప్పుడు కాదని చెప్పానని.. అయితే ఒకరోజు ఏకంగా తనను ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లాడని.. అప్పుడు తో సినిమా చేయాలని.. ఒత్తిడి చేశారు. ‘నన్ను ఎక్కడికెక్కడికో మేనేజర్ తిప్పాడు.. అసలు నేను ఎన్టీఆర్‌తో సినిమా చేస్తానని చెప్పకుండానే ఎన్టీఆర్‌తో సినిమా ఎలా చేద్దాం.., ఎక్కడ చేద్దాం అని మాట్లాడారు. దీంతో నేను బాగా ఇబ్బంది పడ్డాను. ఎన్టీఆర్ కూడా స్టార్ హీరోనే కాబట్టి నేను ఎన్టీఆర్‌తో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను’ అని అప్పుడెప్పుడో జరిగిన ఆసక్తికర విషయాన్ని సురేందర్ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పాడు.
నిజమేనా!?
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌తో సురేందర్ తీసిన రెండు సినిమాలూ ఆశించినంతగా ఆడలేదు. అశోక్ సినిమా డిజాస్టర్ అయితే... ఆ కాంబోలో వచ్చిన మరో సినిమా ఊసరవెల్లి అట్టర్ ప్లాప్ అయ్యింది. మరి సురేందర్ మాత్రం తాజాగా.. హడావుడి చేస్తున్నాడు.. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే ఎన్టీఆర్ అప్పటి మేనేజర్ కానీ.. జూనియర్ రియాక్ట్ అయితే క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే సురేందర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి జూనియర్ దీనికి ఏమంటారో ఏంటో..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout