'యన్.టి.ఆర్' రెండోభాగం విడుదల కన్‌ఫర్మ్ చేశారు.
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. ఈ దివంగత ముఖ్యమంత్రి జీవిత చరిత్రను 'యన్.టి.ఆర్ కథానాయకుడు', 'యన్.టి.ఆర్ మహానాయకుడు' అనే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు భాగాల్లో 'యన్.టి.ఆర్ కథానాయకుడు' చిత్రీకరణ పూర్తయ్యింది. కాగా 'యన్.టి.ఆర్ మహానాయకుడు' చివరి షెడ్యూల్ జరుగుతుంది. ఈ శుక్రవారం ఆడియో విడుదలవుతుంది. ఈ రెండు భాగాల్లో 'యన్.టి.ఆర్ కథానాయకుడు' సినిమా జనవరి 9న విడుదలవుతుంది.
రెండో భాగం 'యన్.టి.ఆర్ మహానాయకుడు'ని జనవరి 24న విడుదల చేద్దామనుకున్నారు. అయితే అప్పటికీ మొదటి భాగం విడుదలై మూడు వారాలే అయ్యుంటుంది. కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్‌కి వర్కవుట్ కాదని ట్రేడ్ వర్గాలు చెప్పడంతో దర్శక నిర్మాతలు రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయడానికి నిర్ణయం తీసేసుకున్నారు. విడుదల వాయిదా పడుతుందని వార్తలు వినిపించాయి. అయితే అధికారికంగా యూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com