'మహానాయకుడు': అనుకున్నదొక్కటి అయినదొక్కటి..!

  • IndiaGlitz, [Saturday,February 23 2019]

ఆంధ్రుల అన్నగారు, దివంగత ముఖ్యమంత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్'. దీన్ని రెండు భాగాలుగా చేసిన దర్శకుడు క్రిష్.. మొదటి భాగంలో ఆయన సినీ జీవితం, రెండో భాగంలో రాజకీయ జీవితం చూపించారు. ఈ రెండు భాగాల్లోనూ ప్రధాన పాత్రల్లో నటించింది.. నందమూరి బాలయ్యే. మొదటి భాగం ‘కథా నాయకుడు’ సక్సెస్ అయ్యింది కానీ.. రెండో భాగం మాత్రం ఆశించినంత కాదు కాదు.. అట్టర్ ప్లాప్ అయ్యిందని నందమూరి అభిమానులే చెబుతుండటం గమనార్హం. ఇందుకు కారణం లేకపోలేదు.. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో జరగరానికి చాలానే జరిగాయ్.. అప్పట్లో ఏం జరిగిందన్న విషయం తెలుగు ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో మాత్రం చూపించాల్సింది చూపకుండా అన్ని పాజిటివ్‌‌గానే చూపడంతో మహానాయకుడు డిజాస్టర్‌‌ దిశగా అడుగులేసిందని విమర్శకులు చెబుతున్నారు.

మొదటి రోజు కేవలం రూ. 1.5 కోటి షేర్ రావడం గమనార్హం. ఉత్తరాంధ్రా నుంచి 14 లక్షల రూపాయలు, కృష్ణా నుంచి 12 లక్షల రూపాయిలు.. గుంటూరు నుంచి రూ. 19 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గట్టిగా ఈ బయోపిక్‌‌ను తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్‌‌ సింగిల్ షోకు వెళ్తే కచ్చితంగా ఆశించిన దానికంటే ఎక్కువగా సినిమా హిట్ టాక్ అందుకోవడమే కాదు.. కలెక్షన్ల వర్షం కురిసేది. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు, నందమూరి అభిమానులు గట్టిగా ‘మహా నాయకుడు’ పట్టించుకుని ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేది కాదేమో. అయితే పైన చెప్పినవేమీ జరగకపోగా.. సినిమాను పట్టించుకునే నాథుడే లేకపోవడం ఒకరకంగా చెప్పాలంటే బయోపిక్ తెరకెక్కించి ఎన్టీఆర్‌‌ను అవమానపరచడమేనని సినీ విశ్లేషకులు, విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

‘మహానాయకుడు’ కంటే 'ఆఫీసర్'!

బహుశా బాలయ్య కూడా మొదట ఏదో ఉత్సాహంతో సినిమా గురించి అనుకున్నప్పటికీ కలెక్షన్స్ దాకా వచ్చేసరికి కళ్లు తిరగడం మాత్రం పక్కాగా జరిగే ఉంటుందేమో. అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా పడిందిలే బుల్ బుల్ పిట్టా అనే పాట గుర్తొస్తోందిక్కడ.! సంచలన దర్శకుడు వర్మ ‘ఆఫీసర్’ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో తొలిరోజే రూ.3.44 లక్షలు వసూలు చేస్తే.. ‘మహానాయకుడు’ మాత్రం ఎక్కడో తేడా కొట్టిందనే స్పష్టంగా అర్థం చేస్కోవచ్చని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అభిమానులు ఆశించినంతంగా సినిమాలో సన్నివేశాలు మొత్తమ్మీద స్టోరీనే లేదన్నమాట.

అందరి చూపు ఆర్జవీ వైపే..

మహానాయకుడుకు వచ్చిన మొదటి షో కలెక్షన్స్.. ఇంచుమించు చిన్నపాటి సినిమాలకు వస్తాయేమో. కాగా.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు, ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు సైతం వేయి కళ్లతో వేచి చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. మరి ఈ మూవీ రేంజ్‌‌ ఎలా ఉంటుందో.. ఏ మాత్రం కాసుల వర్షం కురిపిస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

అసలేం జరిగిందిలో సంచితా పదుకునే 

రోజాపూలు, ఒకరికిఒకరు, పోలీస్ పోలీస్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. వంటి  విజయవంతమైన చిత్రాలతో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్

'మిఠాయి' పై రాహుల్ రామకృష్ణ పిచ్చి ట్వీట్స్..

టాలీవుడ్‌‌లో విజయదేవరకొండ 'అర్జున్‌‌రెడ్డి', 'గీత గోవిందం' మూవీలతో ఎంత పేరు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండే రెండు సినిమాలతో టాప్ హీరోల జాబితాలో చేరిపోయాడు.

'ప్రాణం ఖరీదు' సాంగ్ టీజర్ ను విడుదల చేసిన వందేమాతరం శ్రీనివాస్

ప్రశాంత్ అవంతిక  హీరోయిన్ గా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో యన్. ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి

బాబు ఓడిపోతున్నారు.. గెలిచేది వైసీపీనే.: కేటీఆర్

గత కొన్నిరోజులుగా ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. టీడీపీ సిట్టింగ్‌‌లు అందరూ ఆ పార్టీకి టాటా చెప్పేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి

కేసీఆర్ కేబినెట్‌‌లో ఇద్దరు మహిళలకు అవకాశం

తెలంగాణ కేబినెట్ మొదటి విస్తరణ ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విస్తరణలో మహిళా ఎమ్మెల్యేలకే కాదు సొంత ఇంట్లోని వారికి కూడా గులాబీ బాస్,