బరువు తగ్గుతున్న యంగ్ టైగర్
- IndiaGlitz, [Saturday,March 11 2017]
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. జనతాగ్యారేజ్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎన్టీఆర్..ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై 'జై లవకుశ' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నివేదా థామస్, రాశిఖన్నా హీరోయిన్స్. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తాడని సమాచారం.
ఈ సినిమాలో పాత్రల్లో వేరియేషన్ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో ఉన్నాడట. సమాచారం ప్రకారం విదేశాలకు వెళ్ళిన ఎన్టీఆర్ దాదాపు పది నుండి పదిహేను కిలోల బరువు తగ్గుతున్నాడట. ఎన్టీఆర్ లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఏదేమైనా పాత్ర కోసం ఇంత బరువు తగ్గడం చూస్తుంటే..ఎన్టీఆర్ కమిట్మెంట్ అర్థమవుతుంది.