మలయాళం నేర్చుకుంటున్న యంగ్ టైగర్..!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్, హైటెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కతోన్న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్, భీమ్ ఫర్ రామరాజు వీడియో ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ప్రోమోలో రామ్‌చరణ్ వీడియోకు తారక్ వాయిస్ ఓవర్‌ను అందించారు.
అసలు విషయమేమంటే ఐదుభాషల్లో మలయాళం తప్ప మిగిలిన భాషలన్నింటికీ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడం విశేషం. అయితే ఇప్పుడు మలయాళంపై తారక్ ఫోకస్ పెట్టాడట. మలయాళంను నేర్చుకనే పనిలో బిజీగా ఉన్నాడట తారక్. అందుకు తగినట్లు క్వారంటైన్ కూడా ఆయనకు కలిసొచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి. మరి సినిమాకు ఐదు భాషల్లో తారక్ చెబుతాడో లేదో అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సినిమాను వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే కరోనా ప్రభావంతో సినిమా విడుదల ఆలస్యమయ్యేలానే కనపడుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com