'దర్శకుడు' టీజర్ విడుదల చేసిన యంగ్ టైగర్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం 'దర్శకుడు'. అశోక్, ఈషా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్కా దర్శకుడు. సుకుమార్‌తో పాటు బిఎన్సిఎస్పి విజయ్‌కుమార్, థామస్ రెడ్డి అదూరి, రవిచంద్ర సత్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో విడుదలైన తొలి చిత్రం కుమారి 21 ఎఫ్ సినిమా పెద్ద సక్సెస్‌ను సాధించింది. ఆ సినిమా తారక్ చేతుల మీదుగానే మొదలై పెద్ద హిట్ అయ్యింది. తారక్ కుమారి 21ఎఫ్ అనే చిన్న సినిమాను చూసి ఒకే ఒక ట్వీట్‌తో సినిమాను సూపర్‌హిట్ చేసేశాడు. ఎలాంటి సందేహం లేకుండా తారక్‌ను అడగ్గానే తనే ముందుండి టీజర్‌ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నా బ్యానర్లో చేసిన ప్రతి సినిమాకు తారక్ రావడం అనేది ఆనవాయితీ కావాలనుకుంటున్నాను. ఇక దర్శకుడు సినిమా విషయానికి వస్తే, సాధారణంగా నేను డైరెక్ట్ చేసే సినిమా కథలే నాకు నచ్చవు. కానీ నాతో పాటు ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేసిన హరిప్రసాద్ చెప్పిన కథ నచ్చి చేసిన సినిమా ఇది. హరి సినిమాను చాలా బాగా చేశాడు. సినిమాను చూశాడు. ఒక దర్శకుడు తన ప్రేమకు, ప్యాషన్‌కు మధ్య నలిగి పోయే కథే ఇది. సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కుమారి 21ఎఫ్లాగే ఈ సినిమాను కూడా పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నాను అని సుకుమార్ తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ''కుమారి 21 ఎఫ్ కంటే సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం. దర్శకుడు హరి సినిమాను చక్కగా డైరెక్ట్ చేశారని సుకుమార్ తెలిపారు.
దర్శకుడు సినిమా నిర్మాత, దర్శకుడు సుకుమార్ నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి. తన బ్యానర్లో చేసిన సినిమాకు రావడం అనేది తనపై ప్రేమతోనే తప్ప, మరేం కాదు. హరిప్రసాద్‌గారు దర్శకుడుగా లాంచ్ అవుతూ, దర్శకుడు అనే సినిమాను ఎంచుకోవడమే నాకు ఆనందంగా ఉంది. దర్శకుడి లవ్‌స్టోరీ చేయడం కొత్త విషయం. ప్రతి నటుడు సుకుమార్‌తో చేయాలని కోరుకుంటాడు. ఎందుకంటే తను కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. సాధారణంగా మేం నటించే సినిమాల్లో మేం ఎక్కువ కనపడతాం కానీ కథ కనపడదు. కానీ ఏ సినిమాకైనా కథ ఫ్లాట్‌ఫాంలాంటిది. అలాంటి మంచి కథలు తెరకెక్కించడానికి సుకుమార్‌గారు సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్‌ను పెట్టి చేస్తున్న రెండో ప్రయత్నమిది. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న సుకుమార్ రైటింగ్స్‌లో ఇలాంటి సినిమాలనే మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను. అశోక్‌కు కంగ్రాట్స్. సుకుమార్, హరి వంటి బెస్ట్ కాంబినేషన్లో తనకు డెబ్యూ దొరకడం మంచి పరిణామం. టీజర్‌లాగానే సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని భావిస్తూ, ఎంటైర్ టీంకు అభినందనలు అని ఎన్టీఆర్ అన్నారు.
అల్రెడి డైరెక్టర్‌గా ఉన్న ఓ కుర్రాడి లవ్‌స్టోరీయే ఈ సినిమా. కథ తయారైన తర్వాత, ఒక డైరెక్టర్ సెట్లో ఎలా ఉంటాడు. సెట్ బయట ఎలా ఉంటాడో తెలుసుకోవాలనుకున్నాను. అయితే నాలైఫ్‌లో ఇప్పటి వరకు చాలా దగ్గర నుండి చూసిన డైరెక్టర్ సుకుమార్‌గారే. కాబట్టి సినిమాలో కుర్రాడి బాడీ లాంగ్వేజ్ అంతా సుకుమార్‌ను చూసే రాసుకున్నాను. సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు అని దర్శకుడు హరిప్రసాద్ జక్కా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com