గతేడాది తారక్.. వచ్చే ఏడాది పవన్..

  • IndiaGlitz, [Thursday,August 17 2017]

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు.. ఇలా ఒక త‌రంలోని అగ్ర క‌థానాయ‌కులంతా 200, అంత‌కుమించి అన్న‌ట్లుగా సినిమాలు చేస్తే.. రెండో త‌రంలోని అగ్ర క‌థానాయ‌కుల్లో చిరంజీవి, బాల‌కృష్ణ సెంచ‌రీకి పైగా సినిమాలు చేశారు, చేస్తున్నారు. అలాగే ఇదే త‌రంలోని నాగార్జున‌, వెంక‌టేష్ ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

ఇక ఇప్ప‌టిత‌రం తీరు చూస్తుంటే, సెంచ‌రీ మాట సంగ‌తి ప‌క్క‌న పెడితే.. హాఫ్ సెంచ‌రీ కూడా అసాధ్య‌మే అనిపిస్తోంది. అయితే ఈ త‌రంలో ముగ్గురు క‌థానాయ‌కులు మాత్రం త‌మ ల్యాండ్ మార్క్ చిత్రాలకి చేరువ‌య్యారు. వీరిలో ఒక‌రు ఇప్ప‌టికే చేరుకుంటే.. మ‌రో ఇద్ద‌రు ఆ వైపుగా ఉన్నారు. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. జూనియ‌ర్ ఎన్టీఆర్ 'నాన్న‌కు ప్రేమ‌తో' తో 25 చిత్రాల మైలురాయిని చేరుకుంటే..

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏమో త్రివిక్ర‌మ్ చిత్రంతో ఈ మైలురాయికి చేరుకుంటున్నారు. ఇక క‌థానాయ‌కుడిగా మ‌హేష్‌బాబు 25వ చిత్రం ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. ఇక్క‌డ ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. తార‌క్ 25వ సినిమా గ‌తేడాది సంక్రాంతికి విడుద‌లైతే.. ప‌వ‌న్ 25వ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుండ‌డం. తార‌క్ లాగే ప‌వ‌న్ కూడా త‌న ల్యాండ్ మార్క్ చిత్రంతో హిట్ కొడ‌తాడ‌ని ఆశిద్దాం.