ఎన్టీఆర్ గ్యారేజ్ కి నో చెప్పిన ప్రభుదేవా..
Wednesday, March 2, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సాంగ్ కి యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసాడట.
అయితే దేవిశ్రీ ట్యూన్స్ కి ప్రభుదేవా స్టెప్స్ కలిస్తే సాంగ్ అదిరిపోతుందనేది ఎన్టీఆర్ ఆలోచన. ఈ విషయాన్ని ప్రభుదేవాకి చెబితే...నేను దర్శకత్వం వహించే చిత్రాలకు తప్ప బయట చిత్రాలకు కొరియోగ్రఫీ అందించడం లేదంటూ నో చెప్పేసాడట. దీంతో ఈ పాటకు కొరియోగ్రఫీ అందించే బాధ్యతను ప్రభుదేవా సోదరుడు రాజు సుందరంకు అప్పచెప్పారట. త్వరలోనే ఈ పాటను ముంబైలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments