NTR 30: ఫిబ్రవరిలో సెట్స్‌పైకి ఎన్టీఆర్-కొరటాల మూవీ, ముహూర్తం ఫిక్స్.. కథ ఇదేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను అభిమానులు స్క్రీన్ మీద చూసుకుని దాదాపు మూడేళ్లు కావొస్తోంది. అప్పుడెప్పుడో త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత తర్వాత మళ్లీ ఆయన వెండితెర మీద కనిపించలేదు. కారణంగా ఆర్ఆర్ఆర్ . రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ఆయన నటించిన ఈ సినిమా వాస్తవానికి 2021లోనే రావాల్సింది. కానీ అప్పట్లో దేశంలో కోవిడ్ ఉద్ధృతంగా వుండటం, తదితర కారణాలతో షూటింగ్ ఆలస్యమైంది. పరిస్ధితులు చక్కబడి 2022 సంక్రాంతి కానుకగా ఆర్ఆర్ఆర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాటు చేశారు.

అలాగే చిత్ర యూనిట్ కూడా ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో భారీ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించింది. తీరా విడుదలకు ముందు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ ఉవ్వెత్తున ఎగిసిపడటంతో సంక్రాంతి బరిలో నుంచి ఆర్ఆర్ఆర్ తప్పుకుంది. దీనిని మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సంగతి పక్కనబెడితే.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగిసిన వెంటనే దీనిని పట్టాలెక్కించాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అది వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో NTR 30కి సంబంధించి ఓ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 7న అఫీషియల్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారట. ఈ ఈవెంట్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా వస్తారని ఫిలింనగర్ టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఫిక్సయినట్లుగా కథనాలు వస్తున్నాయి. కానీ అఫీషియల్‌గా క్లారిటీ రాలేదు.

ఇక సంగీత దర్శకుడిగా అనిరుధ్ వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ ఒక విద్యార్ధి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. బస్తీలో పేద విద్యార్థుల హక్కుల కోసం ప్రభుత్వంతో హీరో ఎటువంటి పోరాటం చేశాడు అనే ఇతివృత్తంతో NTR 30 తెరకెక్కుతుందని టాక్.

More News

కోవిడ్ నుంచి కోలుకున్న లతా మంగేష్కర్.. వెంటిలేటర్ తొలగింపు

దిగ్గజ నేపథ్య గాయనీ, భారతరత్న లతా మంగేష్కర్ (92) ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

‘ చింతామణి ’ నాటకంపై నిషేధం.. ఏపీ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన ఎంపీ రఘురామ

దశాబ్ధాలుగా తెలుగువారిని అలరిస్తున్న ‘‘చింతామణి’’ నాటకంపై ఇటీవల ఏపీ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

హిందూపురంలో ఆందోళన.. బాలయ్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది.

సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం.. మేనమామ కమలాకర్ రావు కన్నుమూత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనమామ గునిగంటి కమలాకర్ రావు (94) కన్నుమూశారు.

సాయిపల్లవిపై బాడీ షేమింగ్‌‌ కామెంట్స్: మహిళల ఎదుగుదలను ఓర్వలేరు.. గవర్నర్ తమిళిసై ఆగ్రహం

నేచురల్ స్టార్ నాని  హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘శ్యామ్ సింగరాయ్’’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.