బాబాయ్ బాలయ్యకు అబ్బాయ్‌లు బర్త్ డే విషెస్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అ్రగనటుడు కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో ఆయన 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు వారి వారి ఇళ్లలోనే కేక్‌లు కట్ చేసి.. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం బాలయ్యకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (అబ్బాయి) బాబాయ్ బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బాలయ్య రేర్ ఫొటోను పోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. మరోవైపు మరో అబ్బాయ్ నందమూరి కల్యాణ్ రామ్ కూడా ట్విట్టర్ వేదికగా బాబాయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ ట్వీట్ ఇదీ..
‘నా లోని అభిమానిని తట్టి లేపింది మీరే.. నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే.. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబాయ్‌కు 60వ పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ చివర్లో జై బాలయ్య, హ్యాపీ బర్త్ డే ఎన్బీకే అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. ఈ ట్వీట్‌కు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. ఇంకొందరు అభిమానులు కామెంట్ల వర్షం కూడా కురిపిస్తున్నారు.
కల్యాణ్ రామ్ ట్వీట్ సారాంశం ఇదీ..
‘మీరు ఎందరికో బాలయ్య.. నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను. మీ స్ఫూర్తి తోనే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబాయ్‌కు 60వ పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు పలువురు అభిమానులు, నెటిజన్లు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
నాటి నుంచి నేటి వరకూ..!
కాగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగింది మొదలుకుని బాబాయ్.. అబ్బాయ్‌లు ఎక్కడా కలుసుకున్న సందర్భాల్లేవ్. అంతేకాదు ఆఖరికి సొంత అక్క నందమూరి సుహాసిని హైదరాబాద్‌లోని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటకీ బాలయ్యే ముందుండి చూసుకున్నారే తప్ప అబ్బాయ్‌లు ఎక్కడా అడ్రస్ కనిపించలేదు. చిన్నపాటి ప్రకటన చేశారే తప్ప.. కనిపించలేదు.. అవన్నీ వారి వ్యక్తిగతం. ఇక ఇండస్ట్రీ విషయంలో బాలయ్య చేసిన వ్యాఖ్యల పట్లగానీ.. రాజకీయంగా వచ్చిన కొన్ని ఆరోపణలపై కానీ ఇంతవరకూ ఒకరికొకరు మాట్లాడుకున్న సందర్భాల్లేవ్. దీంతో బాలయ్య బర్త్ డే రోజున విషెస్ చెబుతారో లేదో అని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. బర్త్ డేను గుర్తు పెట్టుకుని మరీ అబ్బాయ్‌లు ఇద్దరూ ఆసక్తికర ట్వీట్లే చేశారు.
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK pic.twitter.com/C2zDH9iO44
— Jr NTR (@tarak9999) June 10, 2020
మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai #HappyBirthdayNBK pic.twitter.com/ZhRClCvXRJ
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 10, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments