ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మూవీ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నాన్నకు ప్రేమతో..సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీని శ్రీమంతుడు సినిమాని నిర్మించిన మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీని ఈనెల్లో ప్రారంభించనున్నారు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్..రైటర్ వక్కంతం వంశీతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కళ్యాణ్ రామ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కలసి నటించనున్నారు. ఈ నందమూరి మల్టీస్టారర్ ని ఏప్రిల్ నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకాభిమానుల అంచనాలకు తగ్గట్టు పవర్ ఫుల్ స్టోరితో ఈ మూవీ ఉంటుందని వక్కంతం వంశీ అంటున్నారు. మరి..ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను ఎలా చూపిస్తాడో..చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com