ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ మూవీ ఫిక్స్

  • IndiaGlitz, [Monday,October 19 2015]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం నాన్న‌కు ప్రేమ‌తో..సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాని సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీని శ్రీమంతుడు సినిమాని నిర్మించిన మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీని ఈనెల్లో ప్రారంభించ‌నున్నారు.

ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్..రైట‌ర్ వక్కంతం వంశీతో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.క‌ళ్యాణ్ రామ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఇద్ద‌రు క‌ల‌సి న‌టించ‌నున్నారు. ఈ నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్ ని ఏప్రిల్ నుంచి ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకాభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ప‌వ‌ర్ ఫుల్ స్టోరితో ఈ మూవీ ఉంటుంద‌ని వ‌క్కంతం వంశీ అంటున్నారు. మ‌రి..ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ల‌ను ఎలా చూపిస్తాడో..చూడాలి.

More News

2015లోనే 7 సినిమాలున్నాయి

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే దానికంటే..ఏ రేంజ్ లో కలెక్షన్లు వసూళ్లు చేసింది అనే దానిపైనే ఫోకస్ ఉంది.

12 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమా చేస్తున్నాడా..?

త‌రుణ్‌, త్రిష‌, శ్రియ కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం నీ మ‌న‌సు నాకు తెలుసు. ఈ సినిమాని సూర్యా మూవీస్ ప‌తాకంపై ఎ.ఎం.ర‌త్నం నిర్మించారు. ఎ.ఎం.ర‌త్నం త‌న‌యుడు ఎ.ఎం.జ్యోతిక్రిష్ణ ఈ సినిమాని తెర‌కెక్కించారు.

'కంచె' కు కథే స్టార్...కమర్షియల్ సక్సెస్ ష్యూర్ - డైరెక్టర్ క్రిష్

గమ్యం,వేదం,క్రిష్ణం వందే జగద్గురుమ్..ఇలా వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించి...తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న విభిన్న కధా చిత్రాల దర్శకుడు క్రిష్.

ర‌వితేజ లెక్కే ప‌వ‌న్‌క్కూడా..

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌.. నిర్మాణంలో ఉండ‌గానే ఈ సినిమా ఎంతో బ‌జ్ క్రియేట్ చేస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా కావ‌డ‌మే ఈ రేంజ్ బ‌జ్ కి కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

చిరు ఇంటికి ప‌వ‌న్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఓ ముఖ్యపాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే.