50 కోట్ల క్లబ్ లో ఎన్టీఆర్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం నాన్నకు ప్రేమతో...సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన నాన్నకు ప్రేమతో...సంక్రాంతి కానుకగా రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. తొలి రోజు మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న నాన్నకు ప్రేమతో...ఆతర్వాత టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ తో రన్ అవుతుంది.
అయితే ఎన్టీఆర్ నటించిన బాద్ షా చిత్రం 47 కోట్లు షేర్ వసూలు చేసింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులు 50 కోట్లు షేర్ వసూలు చేసే సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసారు. అయితే నాన్నకు ప్రేమతో..సినిమాకి మిక్సిడ్ టాక్ రావడంతో ఈ సినిమా 50 కోట్ల మార్క్ దాటడం కష్టమే అనుకున్నారు. కానీ...నేటితో నాన్నకు ప్రేమతో...సినిమా 50 కోట్లు షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఎన్టీఆర్ కెరీర్ లో 50 కోట్ల షేర్ వసూలు చేసిన ఫస్ట్ మూవీగా నిలిచింది నాన్నకు ప్రేమతో...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com