ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ప్రారంభం...

  • IndiaGlitz, [Monday,February 22 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న క్రేజీ మూవీ జ‌న‌తా గ్యారేజ్. మిర్చి, శ్రీమంతుడు చిత్రాల‌ను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టిస్తున్నారు.
మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఈ చిత్రంలో ముఖ్య‌పాత్ర పోషిస్తున్నారు. అలాగే డైలాగ్ కింగ్ సాయికుమార్ కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. రామోజీ ఫిలింసిటీలో షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత సారథి స్టూడియోలో మూడు కోట్ల‌తో ప్ర‌త్యేకంగా రూపొందించిన గ్యారేజ్ సెట్ లో షూటింగ్ చేయ‌నున్నారు. ఆత‌ర్వాత చెన్నై, ముంబై, కేర‌ళ‌లో షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్న జ‌న‌తా గ్యారేజ్ ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

వైట్లతో వరుణ్ తేజ్...

వరుణ్ తేజ్,క్రిష్ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ఢీ,రెడీ,

మరోసారి బికినీలో నయన...

అజిత్ బిల్లా చిత్రంలో బికినీ అభిమానులను అలరించిన నయనతార మరోసారి బికినీ అందాలతో కనువిందు చేయడానికి రెడీ అవుతుంది.

సుమంత్ అశ్విన్ కోసం 'రైట్ రైట్' అంటూ విజిల్ ఊదిన సునీల్

సినిమా సినిమాకీ తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకుంటూ,యూత్,ఫ్యామిలీస్ కి దగ్గయరయ్యారు సుమంత్ అశ్విన్. లవర్స్,కేరింత,కొలంబస్..

చిరు, చరణ్ సినిమాలకు బ్రేక్ పడుతుందా?

ఏడేళ్ళ తర్వాత కత్తి రీమేక్ చిత్రంలో నటించడానికి చిరంజీవి సిద్ధం అవుతున్నాడు.

లారెన్స్ ఇప్పుడు బండ్ల గణేష్ తో...

స్టార్ కొరియోగ్రాఫర్ నుండి స్టార్ డైరెక్టర్ గా మారిని రాఘవ లారెన్స్ ముని,కాంచన,గంగ వంటి హర్రర్ కామెడి చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.