ఎన్టీఆర్ సినిమాలో మరో హీరోయిన్..

  • IndiaGlitz, [Thursday,March 31 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ కూడా న‌టిస్తుంది. ఆమె విదీశ‌. అత్తిలి స‌త్తిబాబు, దేవ‌రాయ చిత్రాల్లో హీరోయిన్ గా విదీశ న‌టించింది.
అయితే హీరోయిన్ విదీశ ఎన్టీఆర్ కి వ‌దిన‌గా న‌టిస్తుంద‌ట‌. ఈ చిత్రంలో మ‌ల‌యాళ హీరో ఉన్ని ముకుంద‌న్ ఓ ముఖ్య‌పాత్ర పోషిస్తున్నాడు. ఉన్ని ముకుంద‌న్ కి జంట‌గా విదీశ న‌టిస్తుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఎన్టీఆర్, మోహ‌న్ లాల్, ఉన్ని ముకుంద‌న్, విదీశ ల‌పై కొన్ని సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. కెరీర్ ఇక అయిపోయింది అనుకుంటున్న త‌రుణంలో విదీశ కి జ‌న‌తా గ్యారేజ్ లో అవ‌కాశం రావ‌డం అంటే అదృష్ట‌మే. మ‌రి... ఈ సినిమాతోనైనా విదీశ ద‌శ తిరుగుతుందేమో చూడాలి.

More News

రెహ్మాన్ కోసం గెస్ట్ గా మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు...జనరల్ గా మాట్లాడడం తక్కువ..మీడియాతో మాట్లాడడం ఇంకా తక్కువ.అలాగే ఫంక్షన్స్ కి వెళ్లడం కూడా తక్కువే అని చెప్పాలి.

బాలయ్య వందో సినిమాకి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..

నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా గురించి రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది.

ఎన‌భై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న చుట్టాల‌బ్బాయి

ఆది, న‌మిత‌, యామిని హీరో, హీరోయిన్లుగా వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రాన్నిశ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ త‌లారి నిర్మిస్తున్నారు.

స‌ర్ధార్ సెన్సార్ పూర్తి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - కాజ‌ల్ జంట‌గా న‌టించిన చిత్రం స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కించారు. ఈ సెన్సేష‌న‌ల్ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను ఈరోజు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది.

గ్లామ‌ర‌స్ అంటే స్కిన్ షో చేయ‌డం కాదు...అదే. - హీరోయిన్ హ‌ర్షిక

సూర్యతేజ, హర్షిక‌ పూనాచా హీరో హీరోయిన్లుగా రూపొందిన‌ చిత్రం అప్పుడలా ఇప్పుడిలా. కె.ఆర్.విష్ణు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. జంపా క్రియేషన్స్ బ్యానర్ పై  ప్రదీప్ కుమార్ జంపా ఈ చిత్రాన్ని నిర్మించారు.