ముంబాయిలో ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్...

  • IndiaGlitz, [Saturday,February 13 2016]

నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాతో స‌క్సెస్ సాధించిన ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ జ‌న‌తా గ్యారేజ్ లో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం సార‌థీ స్టూడియోలో ఓ గ్యారేజ్ సెట్ వేసారు. ఈ సెట్ లో ఈ నెలాఖ‌రు నుంచి షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఈ చిత్రంలో ఓ ముఖ్య‌పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న పై కొన్ని కీల‌క‌ సన్నివేశాల‌ను మొద‌టి షెడ్యూల్ లో చిత్రీక‌రించ‌నున్నారు. ఇక సార‌థీ స్టూడియోలో షెడ్యూల్ పూర్త‌వ్వ‌గానే యూనిట్ ముంబాయికి షిఫ్టి అవుతుంది. అక్క‌డ ఓ ఇరవై రోజులు పాటు షూటింగ్ చేయ‌నున్నారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

More News

ఫిబ్రవరి 14 న ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకోనున్న సునీల్ - వాసు వర్మ- దిల్ రాజు ల కృష్ణాష్టమి

చక్కటి డాన్సు ల తో, సూపర్బ్ కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్ హీరో గా, వాసు వర్మ దర్శకత్వం లో ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న చిత్రం 'కృష్ణాష్టమి'.

జయం రవి సౌతిండియాలో పెద్ద స్టార్ కావాలి - నాని

జయం రవి, లక్ష్మిమీనన్ నటించిన తమిళ చిత్రం ‘మిరుథన్’ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న బ్యానర్ పై తెలుగలో ‘యమపాశం’ పేరుతో విడుదల చేస్తున్నారు. శక్తి సౌందరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ జరిగింది.

సందీప్ కిష‌న్ మూవీ టైటిల్ ఇదే

యువ హీరో సందీప్ కిష‌న్ త‌మిళ్, మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన నేర‌మ్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

రిలీజ్ డేట్ మార్చ‌మంటున్న సూప‌ర్ స్టార్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే హీరోయిన్ గా న‌టిస్తుంది.

హేబా జోరు

కుమారి 21 ఎఫ్ చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హేబా పటేల్, ఇప్పుడు వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.