ఎన్టీఆర్ టీజర్ వస్తుంది...
Wednesday, June 21, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వంలో `జై లవకుశ` సినిమా చేస్తున్నాడు. నందమూరి కల్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం.
ఈ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ను జూలై మొదటి వారంలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్, రాశిఖన్నా, నందిత రాజ్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు వంటి వరుస విజయాలు తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా `జై లవకుశ`. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments