దసరా కానుకగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవకుశ'
Send us your feedback to audioarticles@vaarta.com
`టెంపర్`, `నాన్నకు ప్రేమతో`, `జనతాగ్యారేజ్` వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం `జై లవకుశ`. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకుడు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్బెంబర్ 21న విడుదల చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మరో విలక్షణమైన సినిమా ఇది.ఎన్టీఆర్ అభిమానులు ఆయన సినిమాను ఎలా చూడాలనుకుంటారో అలా అన్ని ఎమోషన్స్‌తో `జై లవకుశ` చిత్రం మా బ్యానర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. దర్శకుడు బాబి సినిమాలో ప్రతి సన్నివేశాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారు.
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ. హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. అందులో భాగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. రాశిఖన్నా, నివేదితా థామస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ తెలిపారు.
ఈ చిత్రానికి ఎడింగ్ః కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు, సంగీతంః దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీః ఛోటా కె.నాయుడు, నిర్మాతః నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వంః కె.ఎస్.రవీంద్ర(బాబి)
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com