ఎన్టీఆర్ అదరగొట్టాడు
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జైలవకుశ. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా గత గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే 90 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం త్వరలోనే వందకోట్ల గ్రాసర్‌గా నిలవనుంది. గురు నుంచి ఆదివారం వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.54 కోట్ల షేర్ని రాబట్టిందని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు. ఇదే దూకుడు కొనసాగిస్తే.. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందన్నది వారు తెలిపారు. కాగా, జైలవకుశ తరువాత తారక్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో మిలటరీ ఆపరేటివ్ ఆఫీసర్‌గా ఆయన కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com