అందుకే ఎన్టీఆర్ స్పెషల్ అంటున్న కొరటాల
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకÂలో కొరటాల శివ మాట్లాడుతూ...ఈ సినిమా నాకు చాలా స్పెషల్.తారక్ ని నేను అన్నయ్య అని పిలుస్తాను. అన్నయ్యతో నా రిలేషన్ షిప్ చాలా స్పెషల్. ఎందుకంటే... రైటర్ గా అన్నయ్యÂకి బృందావనం సినిమాకి వర్క్ చేసాను. అప్పటికి నేను ఎవరో తెలియదు. కానీ...ఇదే శిల్పకళా వేదిక పై అందరికీ నన్ను పరిచయం చేసారు. కొరటాల శివ అంటే పది మందికి తెలిసింది అప్పుడే. అందుకే ఎన్టీఆర్ తో సినిమా అంటే నాకు స్పెషల్. ఆయన కోసం ఎక్కువ రాస్తాను. ఆయన ఎనర్జికి తగ్గట్టు రాయాలి అని బాగా ఆలోచించి రాస్తాను. ఈ జనతా గ్యారేజ్ తో బ్లాక్ బష్టర్ కొట్టి ఈ రిలేషన్ షిప్ ఇలాగే కొనసాగిస్తాను అంటూ ఎన్టీఆర్ ఎందుకు తనకు స్పెషలో చెప్పారు కొరటాలÂ.అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments