పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర సమాధానమిచ్చిన ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
పంచాయతీ ఎన్నికల ఫలితాలు కుప్పంలో కాకరేపాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత ఇలాకా కుప్పంలో పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడంతో స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలు నిరాశలో కూరుకుపోయారు. కొందరైతే రాజీనామాలకు సైతం సిద్దమయ్యారు. అయితే కుప్పంలో ప్రజల్లో ధైర్యం నింపేందుకు అధినేత చంద్రబాబు నియోజకర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారడం విశేషం.
అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మీడియా నుంచి పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. త్వరలోనే తారక్ మరోసారి హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అన్న షో ద్వారా బుల్లితెరపై కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ షోకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు నిర్వాహకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. మీడియా ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా మీడియా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నించింది. దీనికి ఆన్సర్ మీరే చెప్పాలని అన్నారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానమచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ రిపోర్టర్.. పొలిటికట్ ఎంట్రీ ఎప్పుడుంటుందని ప్రశ్నించగా.. దానికి ఎన్టీఆర్ తన స్టైల్లో సమాధానం చెప్పారు. దీనికి సమాధానం మీరే చెప్పాలని, చాలా కార్యక్రమాల్లో దీనికి తాను సమాధానం చెప్పానని అన్నారు. పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించేందుకు ఇది సమయం కాదు, సందర్భం అంతకంటే కాదని అన్నారు. తర్వాత తీరిగ్గా, మంచిగా వేడివేడి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందామని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com