బాలకృష్ణకు నచ్చని కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో 'సింహాద్రి' సినిమాది స్పెషల్ ప్లేస్. అప్పటికి 'ఆది' లాంటి సక్సెస్ ఖాతాలో పడినా ఏదో వెలితి. దానికి ముందు 'సుబ్బు', తరువాత 'అల్లరి రాముడు', 'నాగ' ప్లాప్స్ ఎఫెక్ట్ ఉంది. ఆ టైమ్‌లో 'సింహాద్రి' వచ్చింది. ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఒకవేళ బాలకృష్ణ ముందు ఈ కథను ఓకే చేసి ఉంటే, ఇండస్ట్రీ హిట్ కొట్టే ఛాన్స్ ఎన్టీఆర్ మిస్ అయ్యేవాడు.
ఇదీ చదవండి: "పవన్ కళ్యాణ్‌కి కథ అక్కర్లేదు!"
'సింహాద్రి' కథ ఎన్టీఆర్ కోసం రాసినది కాదు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మామూలుగా రాశారు. తరువాత దర్శకుడు బి. గోపాల్ ద్వారా బాలకృష్ణ దగ్గరకు కథ వెళ్ళింది. 'సమరసింహారెడ్డి'కి స్టోరీ రైటర్ కూడా విజయేంద్రప్రసాద్. దానికి బి. గోపాల్ డైరెక్షన్ చేశారు. మళ్ళీ సేమ్ కాంబినేషన్లో మరో సినిమా ప్లాన్ చేద్దామనుకున్నారు. కానీ, బాలకృష్ణకు 'సింహాద్రి' కథ నచ్చలేదు. నో చెప్పారు. ఆ తరువాత వెంటనే రాజమౌళి దగ్గరకు రాలేదు. ఆయన దగ్గరకు రావడానికి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది.
ఎన్టీఆర్ హీరోగా తమిళ్ డైరెక్టర్ తో దొరస్వామిరాజు ఒక సినిమా స్టార్ట్ చేశారు. కొంత షూటింగ్ కూడా చేశారు. ఏవో కారణాలతో మధ్యలో ఆగింది. అప్పటివరకు తీసిన సినిమాను పక్కనపడేసి, మళ్ళీ కొత్త కథతో సినిమా తీద్దామనుకున్నారు. ఎన్టీఆర్ కోసం ఓ కథ కావాలని విజయేంద్రప్రసాద్ ను అడిగారు. తన దగ్గర ఉన్న కథను రాజమౌళి డైరెక్షన్ అయితే ఇస్తానని కండిషన్ పెట్టడంతో తమిళ్ డైరెక్టర్ ని చెన్నై సాగనంపారు. అప్పుడు ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ మరోసారి సెట్ అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments