ఆరు గెట‌ప్స్‌లో ఎన్టీఆర్‌

  • IndiaGlitz, [Monday,August 03 2020]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. ఇప్ప‌టికే ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ పోషిస్తున్న మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుకి సంబంధించిన లుక్ విడుద‌లైంది. ఇక ఎన్టీఆర్ పోషిస్తున్న తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌కు సంబంధించిన లుక్ విడుద‌ల కావాల్సి ఉంది. చెర్రీ ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇచ్చిన జ‌క్క‌న్న‌, త‌మ‌కు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారోన‌ని తార‌క్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో తార‌క్ ఫ్యాన్స్‌కు చాలా గిఫ్ట్స్ ఉంటాయ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో తార‌క్ ఆరు గెట‌ప్పుల్లో క‌నిపిస్తార‌ట‌. స్వాతంత్ర్యం రాక మునుపు జ‌రిగే ఫిక్ష‌న‌ల్ స్టోరిగా రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బ్రిటీష్ వారికి దొర‌క్కుండా త‌ప్పించుకుని తిరిగడం కోసం ఎన్టీఆర్ గెట‌ప్పులు మారుస్తుంటార‌ట‌. ఈ గెట‌ప్పుల్లో ఓ బ‌ట్ట‌త‌ల లుక్ కూడా ఉంటుంద‌ని అంటున్నాయి సినీ వ‌ర్గాలు.

క‌రోనా ఎఫెక్ట్‌తో ఆగిన ఈ సినిమా షూటింగ్‌.. అక్టోబ‌ర్ త‌ర్వాతే ‘ఆర్ఆర్ఆర్‌’ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవ‌కాశాలున్నాయంటున్నారు. ఇదే క‌నుక జ‌రిగితే మిగిలిన పావుశాతం చిత్రీక‌ర‌ణ‌ను రాజ‌మౌళి పూర్తి చేయ‌డాని నాలుగైదు నెల‌ల స‌మ‌యం తీసుకుంటాడు. మ‌రో వైపు ఆరు నుండి తొమ్మిది నెల‌ల పాటు గ్రాఫిక్స్‌కు స‌మ‌యం తీసుకుంటారు. ఈ లెక్క‌న సినిమా పూర్తి కావ‌డానికి ఏడాది సమ‌యం ప‌డుతుంది. దీంతో వ‌చ్చే ఏడాది కూడా ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా విడుద‌ల ఉండ‌క‌పోవ‌చ్చున‌ని టాక్ కూడా వినిపిస్తోంది.

More News

సుశాంత్‌ని దారుణంగా కొట్టి చంపారు.. ఆధారాలతో వెల్లడించిన డాక్టర్ మీనాక్షి

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్టు సుశాంత్‌ది ఆత్మహత్య అని తేల్చింది.

ఇళ‌య‌రాజాపై నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్యలు

మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ప్ర‌సాద్ ల్యాబ్స్ నుండి త‌న‌ను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపుతున్నార‌ని, త‌న వాయిద్య ప‌రిక‌రాల‌ను నాశ‌నం చేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఇవాళ కూడా...

దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 18 లక్షలు దాటేశాయి. వరుసగా ఐదు రోజులుగా దేశంలో కరోనా కేసులు 50 వేలు దాటుతున్న విషయం తెలిసిందే.

సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్..

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రముఖ రాజకీయ నేతలు కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం..

మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు అండగా నిలవాలని నిర్ణయించారు. నేడు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.