ఆరు గెటప్స్‌లో ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రెస్టీజియస్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. ఇప్పటికే ఈ సినిమాలో రామ్‌చరణ్ పోషిస్తున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన లుక్ విడుదలైంది. ఇక ఎన్టీఆర్ పోషిస్తున్న తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌కు సంబంధించిన లుక్ విడుదల కావాల్సి ఉంది. చెర్రీ ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇచ్చిన జక్కన్న, తమకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారోనని తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో తారక్ ఫ్యాన్స్‌కు చాలా గిఫ్ట్స్ ఉంటాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు ఈ చిత్రంలో తారక్ ఆరు గెటప్పుల్లో కనిపిస్తారట. స్వాతంత్ర్యం రాక మునుపు జరిగే ఫిక్షనల్ స్టోరిగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బ్రిటీష్ వారికి దొరక్కుండా తప్పించుకుని తిరిగడం కోసం ఎన్టీఆర్ గెటప్పులు మారుస్తుంటారట. ఈ గెటప్పుల్లో ఓ బట్టతల లుక్ కూడా ఉంటుందని అంటున్నాయి సినీ వర్గాలు.
కరోనా ఎఫెక్ట్‌తో ఆగిన ఈ సినిమా షూటింగ్.. అక్టోబర్ తర్వాతే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఇదే కనుక జరిగితే మిగిలిన పావుశాతం చిత్రీకరణను రాజమౌళి పూర్తి చేయడాని నాలుగైదు నెలల సమయం తీసుకుంటాడు. మరో వైపు ఆరు నుండి తొమ్మిది నెలల పాటు గ్రాఫిక్స్‌కు సమయం తీసుకుంటారు. ఈ లెక్కన సినిమా పూర్తి కావడానికి ఏడాది సమయం పడుతుంది. దీంతో వచ్చే ఏడాది కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల ఉండకపోవచ్చునని టాక్ కూడా వినిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com