కేరళలో యంగ్ టైగర్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కేరళలో ఈరోజు నుంచి ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.వారం తర్వాత చిత్ర యూనిట్ హైదరాబాద్ రానున్నారు.
ఈ చిత్రంలో మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న జనతా గ్యారేజ్ ఆడియోను ఈనెలలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ భారీ క్రేజీ మూవీని ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments