మ‌ళ్లీ బిగ్‌బాస్‌లోకి యంగ్ టైగ‌ర్‌?

  • IndiaGlitz, [Sunday,September 30 2018]

బాలీవుడ్ నుండి తెలుగులోకి వ‌చ్చిన రియాలిటీ షో బిగ్ బాస్. రెండు సీజ‌న్స్‌ పూర్త‌య్యాయి. మొద‌టి సీజ‌న్‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

రెండో సీజ‌న్‌కు నాని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. మొద‌టి సీజ‌న్ కంటే రెండో సీజ‌న్‌కు పెద్ద‌గా పేరు రాలేద‌ని ప్రేక్ష‌కులు అనుకుంటున్నారు.

అందుకు కార‌ణం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ ఛరిష్మా అటువంటిది మ‌రి. రెండు సీజ‌న్స్ పూర్త‌య్యాయి. ఇప్పుడు మూడో సీజ‌న్ త్వ‌ర‌లోనే స్టార్ట్ కానుంది.

ఈ సీజ‌న్‌కు మ‌ళ్లీ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌నే వ్యాఖ్యాత‌గా తీసుకురావ‌డానికి స్టార్ మా నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ విష‌య‌మై అధికారిక స‌మాచారం వ‌స్తుంద‌ట‌.