బాహుబలి స్టైల్లో 'యన్.టి.ఆర్'...
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి ఏమోజానపద చిత్రం... యన్.టి.ఆర్ ఏమో పీరియాడికల్ డ్రామా.. మరి రెండింటి మధ్య ఉన్న సారూపత్య ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి... సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిచంనుండటమే.వివరాల్లోకెళ్తే... కథ విషయంలో, ఎమోషన్స్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని బాహుబలి రెండు భాగాలుగా తెరకెక్కించారు.
ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, సర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ 'యన్.టి.ఆర్'ను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. ముందు ఒక పార్టులో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం వరకు మాత్రమే తెరకెక్కించాలనుకున్నారు.
కానీ ఆ భాగాన్ని కూడా ఓ పార్టులో తెరకెక్కించడం కష్టంగా భావించి రెండు భాగాలుగా తెరకెక్కించాలనుకుంటున్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుతున్నాయి. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలోనటిస్తూ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com