నెగటిల్ రోల్ లో ఎన్టీఆర్...?

  • IndiaGlitz, [Tuesday,January 24 2017]

డిఫ‌రెంట్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే త‌న త‌దుప‌రి చిత్రానికి రెడీ అవుతున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ సినిమాను నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నిర్మాత‌గా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు జై ల‌వ‌కుశ అనే టైటిల్ విన‌ప‌డుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు రోల్స్ చేస్తున్నాడ‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి.

అందులో ఒక‌టి అమాయ‌క‌మైన పాత్ర కాగా, మ‌రొక‌టి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రట‌. పోలీస్ ఆపీస‌ర్‌కు ధీటుగా ఉండే పాత్రలో నెగ‌టివ్ షేడ్‌లో ఎన్టీఆర్ మ‌రో పాత్ర‌లో కూడా క‌న‌ప‌డ‌నున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఇందులో నిజానిజాలేమిటో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే..