మూడు వేరియేష‌న్స్‌తో ఆక‌ట్టుకున్న ఎన్టీఆర్‌...

  • IndiaGlitz, [Wednesday,October 03 2018]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం 'అర‌వింద స‌మేత‌'... వీర రాఘ‌వ‌... హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌లో ఎన్టీఆర్ మూడు షేడ్స్‌లో చేయ‌బోయతున్న వీర రాఘ‌వ‌రెడ్డి పాత్ర గురించి చూఛాయ‌గా ట‌చ్ చేశాడు. ఒక షేడ్‌లో హీరోయిన్ వెంట‌ప‌డే హరోగా క్యూట్‌గా క‌న‌ప‌డ‌తాడు. ఇందులో పూజా హెగ్డేని పేరు అడిగితే నాకు స్పేస్ కావాలంటూ ఆట ప‌ట్టిస్తుంది. ఇక ఫ్యాక్ష‌నిజం తెలుసా? అని ప్ర‌శ్న‌తో రెండో షేడ్‌ను ట‌చ్ చేశాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఇందులో రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్ట్ వీర రాఘ‌వ రెడ్డిగా క‌నిపిస్తాడు ఎన్టీఆర్‌

కుదుర‌ప్ప‌.. ఇక్క‌డ మంది లేరా? క‌త్తుల్లేవా? అని చెబుతూ వేట కొడ‌వ‌లి, బ‌రిసెల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చంపే ఫ్యాక్ష‌నిస్ట్‌గా క‌న‌ప‌డ‌తారు ఎన్టీఆర్‌.

100 అడుగులు త‌వ్వితే నీళ్లు ప‌డుతుంద‌న్న‌ప్పుడు 99 అడుగులు త‌వ్వి వ‌దిలేసేవాడిని ఏమంటారు సార్‌! మీ విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నాను..

ఈ ఒక్క అడుగు వంద అడుగుల‌తో స‌మానం త‌వ్వి చూడండి అంటూ రావు ర‌మేష్‌తో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పే సంద‌ర్భంలో ప‌ది మందిని బ్ర‌తికించాల‌ని త‌ప‌న ప‌డే మ‌రో షేడ్‌లో అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌ప‌రిచాడు ఎన్టీఆర్‌.

30 ఏండ్ల నాడు మీ తాత క‌త్తి ప‌ట్నాడంటే అది అవ‌స‌రం..

అదే క‌త్తి మీ నాయ‌న ఎత్తినాడంటే అది వార‌స‌త్వం...

అదే క‌త్తి నువ్వు దూసినావంటే అది ల‌క్ష‌ణం...

ఆ క‌త్తి నీ బిడ్డ నాటికి లోప‌మైత‌దా!

అంటూ ఎన్టీఆర్‌తో అత‌ని బామ్మ చెప్పే డైలాగ్స్‌

వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్ట‌గ‌ల‌డు.. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు.. అని పూజా హెగ్డే ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌

వినే టైమ్‌.. చెప్పే మ‌నిషి వ‌ల్ల విష‌యం విలువే మారిపోతుంది నీలాంబ‌రి అని సునీల్‌తో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌..

ఇలా డైరెక్ష‌న్‌తో పాటు త‌న పెన్ ప‌వ‌ర్‌ని త్రివిక్ర‌మ్ మ‌రోసారి చూపించాడు.

ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ్డాడు. అలాగే నాగ‌బాబు, న‌వీన్ చంద్ర పాత్ర‌లు కూడా తెర‌పై క‌న‌ప‌డ‌తాయి.

ఇక త‌మ‌న్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, ఎ.ఎస్‌.ప్ర‌కాశ్ ఆర్ట్ వ‌ర్క్‌, రామ్ ల‌క్ష్మ‌ణ్ స్టంట్స్‌, న‌వీన్ నూలి ఎడిటింగ్ సినిమాను నెక్స్‌ట్ లెవ‌ల్‌కు తీసుకెళ్ల‌డంతో తమ వంతు పాత్రను పోషించాయ‌ని చెప్ప‌క‌నే చెబుతున్నాయి.

More News

క‌న్నీళ్లు పెట్టుకున్న ఎన్టీఆర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'అర‌వింద స‌మేత‌'. అక్టోబ‌ర్ 11న సినిమా విడుద‌ల కానుంది.

బిగ్‌బాస్‌పై నాని స్పంద‌న‌...

బిగ్‌బాస్ సీజ‌న్ 2కు నాని వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌లో నాని వ్యాఖ్యానంపై ... త‌న ప్ర‌వ‌ర్త‌న‌పై చాలా ర‌కాలైన విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నాడు నాని.

వెండితెర‌పై కౌశ‌ల్‌...

బిగ్‌బాస్ సీజ‌న్ 2లో విన్న‌ర్ కౌశ‌ల్‌... ఇప్ప‌టి వ‌ర‌కు బుల్లితెర‌పై సంద‌డి చేస్తూ వ‌చ్చిన కౌశ‌ల్‌కు బిగ్‌బాస్ సీజ‌న్ 2లో నెగ్గ‌డం మంచి క్రేజ్‌ను తెచ్చి పెట్టింది.

మ‌ణిర‌త్నంకి బాంబు బెదిరింపు

ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం న‌వాబ్ సినిమా రీసెంట్‌గా రిలీజైంది.

అక్టోబర్ 4న 'దేశంలో దొంగలు పడ్డారు'

అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్ , రాజ‌న్‌, షానీ, పృథ్విరాజ్‌, స‌మీర్‌, లోహిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు'.