కన్నడ ఎంట్రీకి సిద్ధమైన ఎన్టీఆర్ హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
అ!. అమీతుమీ, బ్రాండ్ బాబు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈషా రెబ్బా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రం `అరవింద సమేత`లో నటిస్తుంది. ఈ అమ్మడు కన్నడ చిత్ర సీమలోకి రంగ ప్రవేశం చేయనుంది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ ఓ చిత్రంలో నటించనున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ చిత్రంలో ఈషా రెబ్బా కాలేజ్ లెక్చరర్ పాత్రలో నటించనున్నారు.
లక్కీ గోపాల్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాను కిరణ్ నిర్మిస్తారు. కిరిక్ పార్టీ, నన్నుదోచుకుందువటే చిత్రాలకు సంగీతాన్ని అందించిన అజనీశ్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. తెలుగులో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపు సాధించుకుంటున్న తరుణంలోనే ఈషా కన్నడ ఎంట్రీ ఆమెకు మరింత ప్లస్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments