ఎన్టీఆర్ హ్యాట్రిక్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జైలవకుశ. సెప్టెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఓవర్సీస్లో ఈ చిత్రం తాజాగా 1.5 మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. ఇలా 1.5 మిలియన్ డాలర్లను క్రాస్ చేయడం ఎన్టీఆర్‌కి ఇదే తొలిసారి కాదు. ఇదివరకు నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలతోనే ఈ ఫీట్‌ని సాధించాడు. అంటే.. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశతో ఈ విషయంలో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడన్నమాట.
అంతేకాదు.. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరో కి ఈ క్రెడిట్ లేదు. మహేష్‌కి వరుసగా ఆరు మిలియన్ డాలర్ సినిమాలున్నా.. ఇలా 1.5 మిలియన్ డాలర్లను వరుసగా మూడు సార్లు సొంతం చేసుకున్న సందర్భం లేదు. మొత్తానికి ఎన్టీఆర్ ఓవర్సీస్లో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడన్నమాట. కంగ్రాట్స్ టు ఎన్టీఆర్!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments